Ajith Kumar: హీరో అజిత్‌పై సునీల్ ప్రశంసల జల్లు .. ఎందుకంటే..?

Sunil Showers Praise on Ajith Kumar

  • అజిత్ లాంటి ఎనర్జీ ఉన్న నటుడిని ఎక్కడా చూడలేదన్న సునీల్
  • హైదరాబాద్ లో నిర్వహించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ సక్సెస్ మీట్‌లో సునీల్ కీలక వ్యాఖ్యలు
  • అజిత్‌తో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సునీల్

అజిత్ లాంటి ఎనర్జీ ఉన్న నటుడిని ఎక్కడా చూడలేదని హీరో సునీల్ అన్నారు. అజిత్ కుమార్ కథానాయకుడిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఈ నెల 10న విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో సునీల్ పాల్గొని ప్రసంగిస్తూ హీరో అజిత్ కుమార్‌‌తో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. అంత సింప్లిసిటీ, హైయెస్ట్ గ్రేడ్ ఉన్న మనిషి అజిత్ అని, ఆయన ఎనర్జీ అద్భుతమని పేర్కొన్నారు. అజిత్ కుమార్‌తో మార్నింగ్ వాక్ చేసిన అనుభవాన్ని సునీల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

దాదాపు తొమ్మిది కిలోమీటర్లు మార్నింగ్ వాక్ చేసిన తర్వాత కూడా ఎటువంటి రెస్ట్ తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్న తీరు చూసి అలాంటి ఎనర్జీ ఉన్న నటుడిని ఎక్కడా చూడలేదని అనిపించిందన్నారు. ఆయన నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు. ఆయనను భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

అప్పట్లో పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా చూసి పవన్ అభిమానులు పూనకాల్లోకి ఎలా వెళ్లిపోయారో, అలాగే ఈ రోజు అజిత్ అభిమానులు కూడా ఈ సినిమాను చూసి అంతే ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. 

Ajith Kumar
Sunil
Good Bad Ugly
Telugu Cinema
Tollywood
Actor Ajith
Ajith's Energy
Success Meet
Movie Success
South Indian Cinema
  • Loading...

More Telugu News