Abhishek Sharma: నిన్న నేను ఆడిన ఇన్నింగ్స్ మా నాన్నకు నచ్చలేదు: అభిషేక్ శర్మ

Abhishek Sharmas Century Didnt Impress His Father

  • నిన్న ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ సంచలన విజయం
  • విధ్వంసక బ్యాటింగ్ తో సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ
  • కానీ, తాను చివరివరకు క్రీజులో ఉండాలన్నది తండ్రి కోరిక అని అభిషేక్ వెల్లడి

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన విశ్వరూపం చూపించాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 141 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ శతకం తన తండ్రి రాజ్‌కుమార్ శర్మను పూర్తిగా మెప్పించలేకపోయిందని అభిషేక్ స్వయంగా వెల్లడించాడు. ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్లలో అభిషేక్ ఒకడు. తన తల్లిదండ్రుల సమక్షంలో ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉందని తెలిపాడు. 

మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ, తన తండ్రి చిన్నప్పటి నుంచి తన ఆటను చూస్తున్నారని, సూచనలు చేస్తూ ప్రోత్సహిస్తుంటారని చెప్పాడు. "మా నాన్న నాకు తొలి కోచ్. ఆయన ముందు సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్‌లో ఇది నా అత్యధిక స్కోరైనా, నాన్న మాత్రం నేను చివరి వరకు క్రీజులో ఉండాలని కోరుకున్నారు. అందుకే నిన్న నేను ఆడిన ఇన్నింగ్స్ ఆయనను సంతృప్తిపర్చలేకపోయింది. ఈ విషయంలో మెరుగుపర్చుకుంటాను" అని అభిషేక్ తెలిపాడు. 

అంతేకాదు, తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో... ఈ షాట్ కొట్టు, ఇలా ఆడాలి అంటూ తన తండ్రి గ్యాలరీ నుంచి సైగల ద్వారా సూచనలు చేస్తుంటాడని అభిషేక్ శర్మ ఆసక్తికర అంశం వెల్లడించాడు. 

ఇక అభిషేక్ శర్మ తండ్రి రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ, ఫామ్ గురించి ఆందోళన చెందవద్దని తన కుమారుడికి చెప్పానని గుర్తు చేసుకున్నారు. "క్రికెటర్ కెరీర్‌లో ఇలాంటివి సహజం. గత మ్యాచ్‌లలో అతను రనౌట్ అయ్యాడు, కొన్నిసార్లు పరుగులు చేయలేకపోయాడు. కానీ ఈసారి ఆత్మవిశ్వాసంతో ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ఆడతాడు" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

మ్యాచ్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ విజయం కోసం తప్పకుండా పరుగులు చేస్తానని అభిషేక్ తనకు చెప్పాడని రాజ్‌కుమార్ వెల్లడించారు.

Abhishek Sharma
Sunrisers Hyderabad
IPL
Rajkumar Sharma
Cricket
Century
Match Winning innings
Punjab Kings
Uppsala Stadium
Father Son Duo
  • Loading...

More Telugu News