Srisailam: శ్రీశైలం హైవేపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

6km Traffic Jam on Srisailam Highway

       


సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తడంతో శ్రీశైలం రహదారిపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరంలో ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో శ్రీశైలం ప్రధాన  రహదారి రద్దీగా మారింది. 

మన్ననూరు చెక్‌పోస్ట్ వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ రుసుము చెల్లించే క్రమంలో ఆలస్యం అవుతుండటంతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆరు కిలోమీటర్ల మేర సిద్ధాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.

Srisailam
Traffic Jam
Srisailam Highway
Saléswaram Jatara
Lingamayya Swamy
Chitra Pournami
Nagarkurnool
Andhra Pradesh
Road Congestion
Telugu States
  • Loading...

More Telugu News