Auto Accident: ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం .. ముగ్గురు మహిళలు మృతి

Three Women Killed in Andhra Pradesh Hit and Run

  • సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదం
  • పరిగి మండలం ధనపురం క్రాస్ వద్ద జాతీయ రహదారిపై ఘటన

సత్యసాయి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. పరిగి మండలం ధనపురం క్రాస్ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి తరలించారు. మృతులను అలివేలమ్మ, ఆదిలక్ష్మమ్మ, శాకమ్మగా గుర్తించారు. వీరంతా రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందినవారు. కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందడంతో దొడగట్ట గ్రామంలో విషాదం నెలకొంది. 

Auto Accident
Road Accident
Hit and Run
Three Women Killed
Satya Sai District
Andhra Pradesh
India
Hindupur Hospital
Dodagatta Village
National Highway
  • Loading...

More Telugu News