Sajjala Ramakrishna Reddy: 33 మందితో వైసీపీ రాజకీయ సలహా సంఘం... కన్వీనర్ గా సజ్జల

YSRCP Announces 33 Member Political Advisory Committee

  • పీఏసీని ప్రకటించిన జగన్ 
  • వైసీపీ కీలకనేతలందరికీ ఈ కమిటీలో స్థానం
  • పీఏసీలో శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు

వైసీపీ అధినేత జగన్ ఇవాళ తమ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించారు. ఈ పీఏసీలో 33 మంది సభ్యులు ఉన్నారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు రోజా, విడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ముద్రగడ పద్మనాభం, సాకే శైలజానాథ్, నందిగం సురేశ్ తదితరులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. 

ఈ రాజకీయ సలహాల కమిటీకి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి సభ్యుల జాబితాలతో కూడిన ప్రకటన విడుదలైంది. కొందరిని తప్పించి... దాదాపు వైసీపీలో కీలక నేతలందరికీ ఈ కమిటీలో స్థానం లభించింది. ఈ పీఏసీలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.

Sajjala Ramakrishna Reddy
YSRCP Political Advisory Committee
Andhra Pradesh Politics
Jagan Mohan Reddy
Y.S. Jagan Mohan Reddy
Political Committee Members
Indian Politics
AP Politics
YSRCP
33-member committee
  • Loading...

More Telugu News