Janasena Party: వైసీపీకి షాక్... నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం

Shock for YSRCP Janasena Wins Nidadavolu Municipality

  • నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు
  • వైసీపీకి 27 మంది కౌన్సిలర్లు
  • జనసేనలో చేరిన 14 మంది వైసీపీ కౌన్సిలర్లు

ఏపీలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు వైసీపీ చేజారాయి. తాజాగా ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. 

నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా... వీరిలో 27 మంది వైసీపీ, ఒక టీడీపీ కౌన్సిలర్ ఉండేవారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్లలో 14 మంది జనసేనలో చేరారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన వశమయింది. నిడదవోలు మున్సిపాలిటీ కూడా చేజారి పోవడంతో వైసీపీ శ్రేణులు డీలా పడిపోయాయి.

Janasena Party
YSR Congress Party
Nidadavolu Municipality
East Godavari District
Andhra Pradesh Local Body Elections
AP Politics
Municipal Politics
Party Defections
  • Loading...

More Telugu News