Hanuman Jayanti: హనుమాన్ జయంతి ర్యాలీ, ఐపీఎల్ మ్యాచ్... హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Restrictions Hanuman Jayanti Rally  IPL Match

  • మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 12 కిలోమీటర్ల మేర హనుమాన్ శోభాయాత్ర
  • రాత్రి 7.30 గంటలకు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్
  • వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచన

ఈ రోజు హనుమాన్ జయంతి, ఐపీఎల్ మ్యాచ్ కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి తాడ్‌బండ్ వరకు హనుమాన్ ర్యాలీ కొనసాగుతోంది. మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ర్యాలీ రాత్రి ఎనిమిది గంటల వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర సాగనుంది.

మరోవైపు, రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

Hanuman Jayanti
IPL Match
Hyderabad Traffic Restrictions
Sunrisers Hyderabad
Punjab Kings
Rajiv Gandhi International Stadium
Traffic Diversion
Hanuman Rally
Gouliguda
Tadbund
  • Loading...

More Telugu News