Donald Trump: ట్రంప్‌ను చంపేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు

Donald Trump Death Threat Man Arrested

  • నిందితుడు షాన్ మోన్పర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ట్రంప్‌ను చంపేది తానేనంటూ యూట్యూబ్‌లో వీడియోలు
  • జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు తుపాకి కొనుగోలు
  • పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన దాడితో షాన్‌కు సంబంధం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామంటూ 32 ఏళ్ల షాన్ మోన్పర్ సామాజిక మాధ్యమంలో పెట్టిన వీడియో కలకలం రేపుతోంది. ఈ వీడియో కాస్తా ఎఫ్‌బీఐ కంట్లో పడటంతో అప్రమత్తమైన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తనను తాను మిస్టర్ సాతాన్‌గా చెప్పుకుంటున్న మోన్పర్ బట్లర్ యూట్యూబ్‌లో పలు వీడియోలు పోస్టు చేశాడు. వాటిలో ట్రంప్, ఎలాన్ మస్క్ సహా పలువురు అధికారుల పేర్లను ప్రస్తావించాడు. తన దారికి అడ్డొచ్చిన అందరినీ చంపేస్తానని ఒక వీడియోలో పేర్కొన్నాడు.

మార్చి 4న పోస్టు చేసిన వీడియోలో ట్రంప్‌ను హతమార్చేది తానేనని పేర్కొన్నాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంతో షాన్‌కు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు ఒక తుపాకి కొనుగోలు చేశాడు. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మరిన్ని తుపాకులు, మందుగుండును కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. విచారణలో షాన్ దోషిగా తేలితే కఠిన శిక్షను ఎదుర్కోక తప్పదు.

Donald Trump
Sean Monper
Death Threats
Social Media
FBI
Arrest
YouTube
Elon Musk
Pennsylvania
Gun Purchase
  • Loading...

More Telugu News