Komatireddy Venkat Reddy: తన క్రికెట్ టీమ్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

- సీబీఐటీ కాలేజీ క్రికెట్ టీమ్ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన మంత్రి
- మేజర్ త్రో బ్యాక్ అంటూ ట్వీట్
- నిలబడిన వారిలో కుడివైపు చివరణ మంత్రి
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సీబీఐటీ కళాశాలలో తమ క్రికెట్ జట్టుకు సంబంధించిన ఒకప్పటి ఫొటోను 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. ఇది తన ఆర్కైవ్స్‌లో లభ్యమైందని పేర్కొన్నారు. 1986లో ఈ ఫొటో తీసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. 'మేజర్ త్రో బ్యాక్' అంటూ ఆయన ఈ ట్వీట్ చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సామాజిక మాధ్యమంలో పంచుకున్న ఈ ఫొటోలో 13 మంది క్రీడాకారులు ఉన్నారు. ఇందులో నిలబడిన వారిలో కుడివైపు చివరన మంత్రి ఉన్నారు. ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మంత్రి చాలా బాగున్నారని, శివ సినిమాలో నాగార్జునలా కనిపిస్తున్నారని పలువురు వ్యాఖ్యానించారు.
