MS Dhoni: ఈ సీజన్ లో ధోనీ కెప్టెన్సీలో తొలి మ్యాచ్ ఆడుతున్న సీఎస్కే... 16 రన్స్ కే ఓపెనర్లు అవుట్

- ఐపీఎల్ లో ఇవాళ సీఎస్కే × కేకేఆర్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
- రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో టోర్నీకి దూరం
- మిగతా మ్యాచ్ లకు కెప్టెన్ గా ధోనీ
- గతంలో ధోనీ సారథ్యంలో ఐదు టైటిళ్లు నెగ్గిన సీఎస్కే
రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇవాళ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో బరిలో దిగింది. ఐపీఎల్ తాజా సీజన్ లో ధోనీ కెప్టెన్సీలో ఇదే తొలి మ్యాచ్.
ఇవాళ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సీఎస్కే, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 16 పరుగులకే ఓపెనర్లు అవుటయ్యారు. రచిన్ రవీంద్ర 4, డెవాన్ కాన్వే 12 పరుగులలు చేసి పెవిలియన్ కు తిరిగొచ్చారు.
ప్రస్తుతం చెన్నై స్కోరు 8 ఓవర్లలో 2 వికెట్లకు 50 పరుగులు. రాహుల్ త్రిపాఠి 11, విజయ్ శంకర్ 23 పరుగులతో ఆడుతున్నారు. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రాణా 1, మొయిన్ అలీ 1 వికెట్ తీశారు.
కాగా, ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో ఐదు టైటిళ్లు నెగ్గి దిగ్గజ జట్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సీజన్ లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పటిదాకా 5 మ్యాచ్ లు ఆడి 4 మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. కేవలం 2 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది.