KL Rahul: ఇది నా అడ్డా... కేఎల్ రాహుల్ 'కాంతార' సెలబ్రేషన్ వైరల్!

KL Rahuls Kantara Celebration After Match Winning Performance

  • చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ విజయం
  • కేఎల్ రాహుల్ అజేయంగా 93 పరుగులు
  • కాంతార సినిమా స్ఫూర్తితో సంబరాలు
  • పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానం

ఐపీఎల్ లో గత రాత్రి జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాహుల్ బ్యాట్ తో విరుచుకుపడ్డాడు. 93 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. తనకు ఇష్టమైన చిన్నస్వామి మైదానంలో రాహుల్ చెలరేగి ఆడాడు. ఇది నా అడ్డా అనే అర్థం వచ్చేలా కాంతార సినిమాలోని సంజ్ఞతో గెలుపు సంబరాలు చేసుకున్నాడు. తద్వారా ఈ స్టేడియం తన సొంత మైదానమని రాహుల్ గర్వంగా ప్రకటించాడు.

164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే కొన్ని వికెట్లు కోల్పోయినా, రాహుల్ తన అద్భుతమైన ఆటతో జట్టును గెలిపించాడు. 53 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యష్ దయాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టి రాహుల్ విజయాన్ని పూర్తి చేశాడు. అనంతరం రాహుల్ చేసిన సెలబ్రేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది.

మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ ఇది తన సొంత మైదానమని, ఇక్కడ ఆడటం తనకు ఎంతో అనుభూతినిస్తుందని చెప్పాడు. మ్యాచ్ తర్వాత తన సెలబ్రేషన్ కు కాంతార సినిమా కూడా ఓ స్ఫూర్తి అని తెలిపాడు. పిచ్ కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ, వికెట్ల వెనుక 20 ఓవర్లు ఉండటం వల్ల పిచ్ ఎలా స్పందిస్తుందో తనకు అర్థమైందని రాహుల్ చెప్పాడు. మంచి ప్రారంభం లభిస్తే భారీ ఇన్నింగ్స్ సాధ్యమే అనుకున్నానని తెలిపాడు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ టోర్నమెంట్‌లో ఓటమి లేకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

KL Rahul
IPL 2023
Delhi Capitals
Royal Challengers Bangalore
Chinnaswamy Stadium
Kantara Celebration
93 runs
Match Winning Performance
Cricket
Indian Premier League
  • Loading...

More Telugu News