PM Modi: వారణాసిలో యువతిపై 23 మంది సామూహిక అత్యాచారం.. స్పందించిన ప్రధాని మోదీ

యూపీలోని వారణాసిలో ఇటీవల 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈరోజు ప్రధాని మోదీ వారణాసిలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం వారణాసిలో దిగిన వెంటనే పోలీసులు, కలెక్టర్‌తో మాట్లాడి, యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిందితులపై చట్టం ప్రకారం కఠిన శిక్ష అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించినట్లు సమాచారం.
కాగా, వారణాసిలో ఓ 19 ఏళ్ల అమ్మాయిపై ఇటీవల 23 మంది... 6 రోజుల పాటు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి మత్తు ఇచ్చి, అనేక చోట్ల కు తిప్పుతూ కీచకపర్వాన్ని కొనసాగించినట్లు విచారణలో తేలింది.