Nitin Gadkari: అమెరికా రోడ్ల కంటే మన రోడ్లను అందంగా తీర్చిదిద్దుతాం: నితిన్ గడ్కరీ

Nitin Gadkari Promises Better Roads Than America

  • దేశ అభివృద్ధిలో రోడ్లది కీలక పాత్ర అన్న నితిన్ గడ్కరీ
  • రోడ్లు బాగున్న దేశం అభివృద్ది చెందుతుందని వ్యాఖ్య
  • గత 11 ఏళ్లలో దేశ వ్యాప్తంగా ఎన్నో రహదారులు, ఫ్లైఓవర్లు నిర్మించామన్న గడ్కరీ

మన దేశంలోని రోడ్లను అమెరికా రహదారుల కంటే అందంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అమెరికా ధనిక దేశం కాబట్టి రోడ్లు బాగుంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారని... కానీ, రోడ్లు బాగున్నందుకే అమెరికా ధనిక దేశం అయిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ఒక సందర్భంలో అన్నారని చెప్పారు. దేశ అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రోడ్లు బాగున్న దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

మన రోడ్లకు సంబంధించి తాను కేవలం హామీలు మాత్రమే ఇవ్వడం లేదని... చేసి చూపిస్తానని నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ రహదారుల బాధ్యతను తనకు అప్పగించారని... గత 11 ఏళ్లలో దేశ వ్యాప్తంగా ఎన్నో రహదారులు, ఫ్లైఓవర్లను నిర్మించామని చెప్పారు.  

Nitin Gadkari
India Roads
US Roads
Road Infrastructure
National Highways
Highway Development
Indian Economy
BJP Government
Road Construction
Flyovers
  • Loading...

More Telugu News