అమెరికాలో కొండెక్కిన కోడిగడ్ల ధర.. డజను ఎంతంటే?

  • బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లను వధించడంతో పెరిగిన ధరలు
  • కేసులు తగ్గినా అదుపులోకి రాని గుడ్ల ధరలు
  • ఈస్టర్ దినమైన 20వ తేదీ వరకు ధరలు పెరిగే అవకాశం
అమెరికాలో కోడిగుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డజను గుడ్ల ధర ఏకంగా రూ. 536కు చేరుకుంది. బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన గుడ్ల ధరలు, కేసులు తగ్గుముఖం పట్టినా దిగి రావడం లేదు. 2023 ఆగస్టులో డజను గుడ్ల ధర 2.04 డాలర్లు (రూ. 175) పలకగా, ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 6.23 డాలర్లు (రూ. 536)కు చేరుకుంది. అప్పటి నుంచి అదే ధర కొనసాగుతోంది.

బర్డ్ ఫ్లూను అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో గుడ్లు పెట్టే దాదాపు 3 కోట్ల కోళ్లను నిర్మూలించారు. దీంతో గుడ్ల ధరలు పెరిగిపోయాయి. కాగా, బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 16.8 కోట్ల కోళ్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వధించారు. ఈ నేపథ్యంలో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కోళ్ల ఫారాలను శానిటైజ్ చేసి మళ్లీ గుడ్ల ఉత్పత్తిని ప్రారంభిస్తున్నారు. ఈస్టర్ దినమైన ఏప్రిల్ 20 వరకు గుడ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.


More Telugu News