హాట్ ఎయిర్ బెలూన్ పైనుంచి పడి వ్యక్తి మృతి.. వీడియో ఇదిగో!

--
రాజస్థాన్ లోని బారన్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్ ను పరీక్షిస్తుండగా ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి బెలూన్ గాలిలోకి లేవడంతో దానికి కట్టి ఉన్న తాడుకు చిక్కుకుని ఓ వ్యక్తి కూడా పైకెగిరాడు. దాదాపు వంద ఫీట్ల ఎత్తుకు చేరుకున్నాక తాడు తెగడంతో కిందపడి మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బారన్ జిల్లా ఫౌండేషన్ డే వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

దీంతో మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన వేడుకలను జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. హాట్ బెలూన్ గాలిలోకి ఎగరడం, తాడుకు చిక్కుకుని ఓ వ్యక్తి దానికి వేలాడడం, పైకెగిరాక తాడు తెగడంతో ఆ వ్యక్తి కింద పడడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించాడని చెప్పారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని కోటాకు చెందిన వాసుదేవ్ ఖాత్రిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.


More Telugu News