ఓటీటీలోకి 'ఛావా'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..!
- విక్కీ కౌశల్, లక్ష్మణ్ ఉటేకర్ కాంబోలో 'ఛావా'
- ఫిబ్రవరి 14న విడుదలైన సినిమాకు బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం
- ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైన సూపర్ హిట్ మూవీ
- నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్
ఈ సినిమాను మార్చి 7న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేయగా... భారీ వసుళ్లను సాధించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.