తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్న కల్యాణ్‌ రామ్‌, విజయశాంతి అండ్ టీం

తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్న కల్యాణ్‌ రామ్‌, విజయశాంతి అండ్ టీం

Kalyan Ram and Vijayashanti Visit Tirumala Temple
    
నంద‌మూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం 'అర్జున్‌ S/o వైజయంతి'. ఈ మాస్ యాక్షన్‌ డ్రామాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే క‌థానాయిక‌గా సయీ మంజ్రేకర్ నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్‌, విజయశాంతి అండ్ టీం ఇవాళ తిరుమల స్వామివారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు చిత్ర బృందానికి ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. 
Advertisement
Arjun S/O Vyjayanthi
Kalyan Ram
Vijayashanti
Arjun S/O Vyjayanthi
Tirumala
Sri Venkateswara Swamy
Tollywood
Telugu Movie
Sai Manjrekar
Movie Release
Religious Visit

More Telugu News