Manik Saha: త్రిపుర సీఎం సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

- ఏకంగా 150 కిలోమీటర్లు రైలు జర్నీ చేసిన సీఎం మాణిక్ సాహా
- రాజధాని అగర్తల నుంచి ధర్మానగర్ వరకు ప్రయాణం
- ధర్మానగర్‌లో 45 అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అగర్తలలో రైలెక్కిన వైనం
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అభివృద్ధి పనుల ప్రారంభం కోసం ఏకంగా 150 కిలోమీటర్లు రైలులో ప్రయాణించడం విశేషం. రాష్ట్ర రాజధాని అగర్తల నుంచి ధర్మానగర్ (దక్షిణ త్రిపుర) వరకు ఆయన సింపుల్‌గా రైలు జర్నీ చేశారు. ధర్మానగర్‌లో 45 అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అగర్తలలో ఆయన రైలెక్కారు.
పదుల కిలోమీటర్ల దూరానికే హెలికాప్టర్లు ఉపయోగించే సీఎంలు ఉన్న ఈ రోజుల్లో మాణిక్ సాహా ఇలా లాంగ్ ట్రైన్ జర్నీ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రంలో కనెక్టివిటీ పెరిగిందని తెలియచేయడంతో పాటు తన సింప్లిసిటీని నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రయత్నం సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి.