సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం భూమిపూజ వీడియో పోస్టు చేసిన మంత్రి నారా లోకేశ్

సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం భూమిపూజ వీడియో పోస్టు చేసిన మంత్రి నారా లోకేశ్

Lokesh Posts Video of Chandrababus New House Groundbreaking Ceremony
  • అమరావతిలో చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం
  • నేడు భూమి పూజ
  • హాజరైన చంద్రబాబు కుటుంబ సభ్యులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సంకల్పించారు. ఇవాళ భూమి పూజ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను నారా లోకేశ్ తన యూట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేశారు. 

చంద్రబాబు రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో సొంతంగా 5 ఎకరాల స్థలం కొనుక్కున్నారు. సచివాలయం వెనుక ఉన్న ఈ-9 రహదారికి పక్కనే ఈ స్థలం ఉంది. ఓ రైతు నుంచి ఈ స్థలం కొనుగోలు చేశారు.
Advertisement
Chandrababu Naidu
Nara Lokesh
Amaravati
House Construction
Groundbreaking Ceremony
Andhra Pradesh
Real Estate
Velagapudi
Naidu Family
YouTube Video

More Telugu News