ఐపీఎల్‌లో వరస్ట్ రికార్డు సొంతం చేసుకున్న శార్దూల్ ఠాకూర్

  • ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ చెత్త రికార్డు
  • ఒకే ఓవర్ లో ఐదు వైడ్లు వేసిన రెండో బౌలర్‌గా నిలిచిన శార్దూల్
  • కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఘటన
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ శార్దూల్ ఠాకూర్ వేసిన ఒక ఓవర్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శార్దూల్ 13వ ఓవర్లో వరుసగా ఐదు వైడ్ బంతులు వేసి ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. తద్వారా ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో ఐదు వైడ్లు వేసిన రెండో బౌలర్‌గా శార్దూల్ నిలిచాడు.

అయితే, ఇదే ఓవర్‌లో చివరి బంతికి అజింక్య రహానె (61 పరుగులు, 35 బంతుల్లో) నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదిలా ఉండగా, గతంలో మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్‌లో ఐదు వైడ్లు వేశాడు. అయితే అవి వరుసగా కాదు. 2023లో బెంగళూరుకు ఆడిన సిరాజ్ ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు వైడ్లు వేశాడు. 


More Telugu News