Jagan Mohan Reddy: డ్యామేజ్ అయిన జగన్ హెలికాప్టర్... రోడ్డు మార్గంలో బెంగళూరుకు పయనం

- ఈరోజు రాప్తాడులో పర్యటించిన జగన్
- హెలికాప్టర్ పైకి దూసుకెళ్లిన వైసీపీ కార్యకర్తలు
- స్వల్పంగా దెబ్బతిన్న హెలికాప్టర్
వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
మరోవైపు, జగన్ వచ్చిన హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. జగన్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు హెలిప్యాడ్ వద్దకు వచ్చారు. హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ కాగానే దాని మీదకు వైసీపీ కార్యకర్తలు దూసుకుపోయారు. దీంతో, హెలికాప్టర్ స్వల్పంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అదే హెలికాప్టర్ లో బెంగళూరుకు వెళ్లడం సురక్షితం కాదని పైలట్లు జగన్ కు చెప్పారు. దీంతో, ఆయన రోడ్డు మార్గంలో బెంగళూరుకు పయనమయ్యారు.