Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హరీశ్ రావు

Harish Rao Expresses Grief Over Pawan Kalyans Sons Accident

  • సింగపూర్ లో విద్యాభ్యాసం చేస్తున్న పవన్ తనయుడు 
  • స్కూల్లో అగ్నిప్రమాదం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్
  • త్వరగా కోలుకోవాలంటూ హరీశ్ రావు ట్వీట్ 

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం పవన్ తనయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పందించారు. 

"సింగపూర్ లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్టు తెలిసింది. ఈ వార్త తీవ్ర విచారానికి గురిచేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ బాధాకరమైన సమయంలో పవన్ కల్యాణ్ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటున్నాను" అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.

Pawan Kalyan
Mark Shankar Pawanovich
Singapore school fire
Harish Rao
AP Deputy CM
Accident
Injury
Tweet
BRS MLA
  • Loading...

More Telugu News