Indian Students: దినదిన గండం.. అమెరికాలో మన విద్యార్థుల పరిస్థితి

Indian Students Face Increasing Difficulties in the US

  • చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష 
  • వీసా రద్దు చేసి విమానం ఎక్కిస్తున్న అధికారులు
  • ఆందోళనలో భారతీయ విద్యార్థులు

ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం అక్కడ ఆందోళనతో గడుపుతున్నారు. ఏ చిన్న పొరపాటు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నట్లు వెల్లడించారు. కారును ఓవర్ స్పీడ్ తో నడిపినా కూడా అధికారులు వీసా రద్దు చేస్తున్నారని, దగ్గరుండి విమానం ఎక్కించి భారత్ కు తిప్పి పంపుతున్నారని చెప్పారు. సోషల్ మీడియా పోస్టులను నిశితంగా పరిశీలిస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కావడంలేదని చెబుతున్నారు.

యూనివర్సిటీ క్యాంపస్ లలో జరుగుతున్న ఆందోళనలతో సంబంధం లేకున్నా గతంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను కారణంగా చూపి భారత్ కు చెందిన ఓ విద్యార్థి వీసాను అధికారులు రద్దుచేశారని వార్తలు వెలువడుతున్నాయి. విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు అవుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయని, ఇందులో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారని అమెరికా కళాశాలలు పేర్కొంటున్నాయి.

Indian Students
US Visa
Study in USA
Visa Cancellation
Donald Trump
American Universities
Student Visas
Over Speeding
Social Media Monitoring
Travel Restrictions
  • Loading...

More Telugu News