Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదంపై చిరంజీవి, కేటీఆర్ స్పందన

Chiranjeevi and KTR React to Pawan Kalyans Sons Injury

  • సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు
  • మార్క్ శంకర్ కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయన్న చిరంజీవి
  • చిన్నారి గాయపడినట్టు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానన్న కేటీఆర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు పవనోవిచ్ మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్నాడు. చిన్నారి చదువుకుంటున్న స్కూల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

ఈ ప్రమాదంపై మార్క్ శంకర్ పెదనాన్న చిరంజీవి స్పందించారు. 8 ఏళ్ల వయసు ఉన్న మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. 

మార్క్ శంకర్ కు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. సింగపూర్ లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్టు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని కేటీఆర్ అన్నారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

Pawan Kalyan
Mark Shankar
Chiranjeevi
KTR
Singapore fire accident
Pawan Kalyan's son
AP Deputy CM
Child injury
School fire
Political reaction
  • Loading...

More Telugu News