Posani Krishna Murali: పోసానికి నోటీసులు ఇచ్చిన సూళ్లూరుపేట పోలీసులు

Posani Krishna Murali Served Notice by Sullurpeta Police

  • పవన్, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు
  • విచారణకు హాజరు కావాలంటూ పోసానికి సూళ్లూరుపేట పోలీసుల నోటీసులు
  • ఇప్పటికే రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపిన పోసాని

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట పీఎస్ లో ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని పోసానికి పోలీసులు నోటీసులు అందజేశారు. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కార్యాలయంలో సంతకం చేసేందుకు పోసాని వచ్చిన సమయంలో ఈ నోటీసులు అందజేశారు. 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ వ్యాప్తంగా 15కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయన పలు జైళ్లలో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపారు. గత నెలలో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

Posani Krishna Murali
Posani Notice
Sullurpeta Police
AP Politics
Pawan Kalyan
Nara Lokesh
Case Filed
Court Notice
Telugu Actor
Criminal Case
  • Loading...

More Telugu News