Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్.. నెట్టింట ఫొటో వైరల్!

- నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు
- తన 43వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్న బన్నీ
- ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేసిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన స్నేహ రెడ్డి
నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. తన 43వ జన్మదిన వేడుకలను బన్నీ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అల్లు అయాన్,అల్లు అర్హలతో కలిసి ఇంట్లో తన ప్రత్యేక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి, భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ తాలూకు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు అభిమానుల నుంచి కూడా బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 'హ్యాపీ బర్త్ డే అన్న' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ఈరోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
ప్రముఖ దర్శకుడు అట్లీతో బన్నీ చేసే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోమవారం ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
