Chandrababu Naidu: అక్కడ ఆయన కొట్టిన దెబ్బకు ఇక్కడ మన రొయ్య ఎగిరిపోయింది: చంద్రబాబు

- సుంకాలు పెంచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఆక్వా రంగంపైనా తీవ్ర ప్రభావం
- ఏం చేయాలో నాకే అర్థం కావడంలేదంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో, ఆక్వా రంగం సంక్షోభంలో చిక్కుకుంది. ట్రంప్ టారిఫ్ పెంపు ప్రకంపనలు ఏపీలోనూ వినిపిస్తున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు.
"ఇవాళ అమెరికాను చూస్తే అతలాకుతలం అయిపోయింది. అక్కడ ఆయన కొట్టిన దెబ్బకు ఇక్కడ మన రొయ్యంతా ఎగిరిపోయింది. నాకేం సంబంధం అనుకుంటే ఎలా? యాక్షన్ కు రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావడంలేదు. అందుకే ఈ రోజు మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నాం. దీనిపై రివ్యూ చేస్తున్నాను. ఒక నిర్ణయంతో ప్రపంచం అంతా కూడా ప్రభావితమైంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికన్లకు లాభమా, నష్టమా అంటే.... అక్కడ కూడా 2 వేల ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. అమెరికాలో ఈ స్థాయిలో నిరసనలు జరగడం నేను ఎప్పుడూ వినలేదు" అని చంద్రబాబు పేర్కొన్నారు.