రేపు పరిటాల సునీత నియోజకవర్గానికి వెళుతున్న జగన్
వైసీపీ అధినేత జగన్ మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గానికి వెళుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు.
రేపు ఉదయం 10.40 గంటలకు చెన్నేకొత్తపల్లికి చేరుకుని అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి వెళతారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన తిరిగి చెన్నేకొత్తపల్లికి చేరుకుని... అక్కడి నుంచి హెలికాప్టర్ లో బెంగళూరుకు బయల్దేరుతారు. ఇటీవల లింగమయ్య హత్యకు గురయ్యారు. టీడీపీ నేతలే ఆయనను దారణంగా హత్య చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.