Peddi Glimpse: రామ్ చరణ్ 'పెద్ది' గ్లింప్స్ సెన్సేషన్ రికార్డు

- రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో 'పెద్ది'
- నిన్న మూవీ మూవీ ఫస్ట్ షాట్ పేరిట గ్లింప్స్ విడుదల
- యూట్యూబ్‌లో 24 గంటల్లోనే 31 మిలియన్లకు పైగా వ్యూస్
- విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ (31.15 మిలియన్లు) రాబట్టిన తెలుగు గ్లింప్స్‌గా రికార్డు
- అంతకుముందు ఈ రికార్డు దేవర (26.17 మిలియన్లు) పేరిట
- ఆ రికార్డును కేవలం 18 గంటల్లోనే చెరిపేసిన 'పెద్ది'
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఫస్ట్ షాట్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. యూట్యూబ్‌లో 31 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ప్రస్తుతం నంబర్ వన్‌గా ఉంది. ఈ క్రమంలో ఈ గ్లింప్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ (31.15 మిలియన్లు) రాబట్టిన తెలుగు గ్లింప్స్‌గా నిలిచింది.
అంతకుముందు ఈ రికార్డు జూనియర్ ఎన్‌టీఆర్ దేవర (26.17 మిలియన్లు) పేరిట ఉండగా... పెద్ది 18 గంటల్లోనే చెరిపేసింది. అయితే, దేవరకు 7 లక్షలకుపైగా లైక్స్ వస్తే... పెద్దికి మాత్రం 4 లక్షలకు పైగా వచ్చాయి.
'పెద్ది' షాట్ ఔట్ ఆఫ్ ది పార్క్ అంటూ సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ గ్లింప్స్ ఆఖర్లో చెర్రీ షాట్ ఆడిన సీన్ అదిరిపోయిందంటున్నారు.
ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న చెర్రీ పుట్టినరోజున పెద్ది విడుదల కానుంది.