Indian Railways: రైలు ప్రయాణంలో ఎంత లగేజీ వెంట తీసుకువెళ్లవచ్చంటే..?

Indian Railways New Luggage Rules for Train Travel

  • స్లీపర్, జనరల్ ప్రయాణికులకు 40 కేజీల లోపు లగేజీకి అనుమతి
  • ఏసీ ఫస్ట్ క్లాస్ లో 70 కేజీలు, ఏసీ 2 టైర్ లో 50 కేజీలు
  • అంతకంటే ఎక్కువ తీసుకెళితే ఆరు రెట్లు ఫైన్

రైలు ప్రయాణంలో వెంట తీసుకెళ్లే లగేజీపై రైల్వే శాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మోసుకెళ్లేది మేమే కదా అని ఇష్టారీతిన లగేజీ తీసుకెళ్లడం ఇకపై కుదరదని తేల్చిచెప్పింది. విమానాశ్రయాల తరహాలో రైల్వే స్టేషన్లలో కూడా లగేజీకి చార్జీలు వసూలు చేయనున్నారు. కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు 70 కేజీల వరకు లగేజీని అనుమతిస్తారు. ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కేజీలు, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ ప్రయాణికులు తమ వెంట 40 కేజీల లగేజీని వెంట తీసుకెళ్లవచ్చునని రైల్వే శాఖ తెలిపింది. అనుమతించిన బరువు కంటే ఎక్కువ బరువున్న లగేజీని తీసుకెళుతూ పట్టుబడితే జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. టికెట్ రేటు కంటే ఈ జరిమానా ఆరు రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పారు.

Indian Railways
Railway Luggage Rules
Luggage Allowance
Train Travel
Railway Luggage Charges
AC First Class
AC 2 Tier
Sleeper Class
General Class
Railway New Rules
  • Loading...

More Telugu News