బీచ్ లో గుర్రంపై విజయ్ దేవరకొండ... చిల్లింగ్ ఫొటోలు వైరల్
ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ రావడంతో విజయ్ దేవరకొండ వెకేషన్ కు వెళ్లాడు. పైగా సమ్మర్ కావడంతో ఓ బీచ్ ఏరియాలో సేదదీరుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు.
కాటన్ బ్యాగీ దుస్తుల్లో ఆరామ్ గా కనిపిస్తున్న ఈ యంగ్ హీరో... గుర్రంపై షికారు చేస్తూ చిల్ అవుతుండడాన్ని ఫొటోల్లో చూడొచ్చు. ఈ ఫొటోలకు అభిమానుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.

