Sunrisers Hyderabad: గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ ఢీ... మనోళ్లు ఏంచేస్తారో!

- ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ కు హ్యాట్రిక్ ఓటములు
- నేడు గెలిచి ఆత్మవిశ్వాసం పుంజుకోవాలని భావిస్తున్న హైదరాబాద్ టీమ్
- సొంతగడ్డ ఉప్పల్ మైదానంలో ఆడుతుండడం కలిసొచ్చే అంశం
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓటమిపాలై ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన స్థితిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ గుజరాత్ టైటాన్స్ ను ఢీకొంటోంది. టాపార్డర్ వైఫల్యంతో హ్యాట్రిక్ ఓటములు చవిచూసిన సన్ రైజర్స్ నేడు గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది. సొంతగడ్డ ఉప్పల్ మైదానంలో ఆడుతుండడం కలిసొచ్చే అంశం. ఈ పోరులో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్ కోసం జట్టులో ఒక మార్పు చేసినట్టు సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. హర్షల్ పటేల్ స్థానంలో జయదేవ్ ఉనద్కట్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు. అటు, గుజరాత్ టైటాన్స్ టీమ్ లోనూ ఒక మార్పు జరిగింది. అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుదిజట్టులోకి వచ్చాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కట్.
గుజరాత్ టైటాన్స్
శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.