Ahmad Basha: ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడి అరెస్ట్

- అహ్మద్ బాషాపై కడపలో పోలీసు కేసులు
- ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ
- కువైట్ వెళుతుండగా ముంబయి ఎయిర్ పోర్టులో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. ఆయన కువైట్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడపలో నమోదైన కేసులకు సంబంధించి లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అహ్మద్ బాషాను కడప పోలీసులకు అప్పగించారు.
కడపలోని వినాయకనగర్‌లో స్థలం విషయంలో దాడికి పాల్పడినట్లు అహ్మద్ బాషాపై కేసు నమోదైంది. అంతేకాకుండా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిని దూషించినందుకు కూడా అతడిపై కేసులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, దేశం విడిచి వెళుతుండగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్ బాషాను కడపకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు.