Donald Trump: ఒక్క డాలర్‌కు 10 లక్షల రియాళ్లు.. ట్రంప్ దెబ్బకు ఇరాన్ కరెన్సీ కుదేలు

Trumps Policies Send Iranian Rial Plummeting

  • రియాల్ విలువ మరింతగా క్షీణించే అవకాశం
  • ట్రంప్ అధికారంలోకి వచ్చాక రియాల్‌పై ఒత్తిడి
  • ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే కారణం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఇరాన్ ఆర్థికంగా కుదేలవుతోంది. ఆ దేశ కరెన్సీ రియాల్ భారీగా పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రియాల్ విలువ ఏకంగా 10,43,000కు పడిపోయింది. మున్ముందు ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి రియాల్‌పై ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే ఇందుకు కారణం.

ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించారు. అంతేకాదు, బరాక్ ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందం నుంచి కూడా వైదొలిగారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇరాన్‌పై అదే రకమైన ఒత్తిడి కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆ దేశంపై భారీగా ఆంక్షలు విధించారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. అణు ఒప్పందంపై నేరుగా చర్చలకు రావాలంటూ ట్రంప్ ఇటీవల రాసిన లేఖపై ఇరాన్ సానుకూలంగా స్పందించలేదు. దీంతో ఇరాన్‌పై బాంబులు వేస్తామని ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు.

Donald Trump
Iran
Iranian Rial
US sanctions
Iran nuclear deal
Trump Iran policy
International Relations
Geopolitics
Oil prices
Economic sanctions
  • Loading...

More Telugu News