Narendra Modi: మోదీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు షురూ

Modis Amaravati Visit Preparations Begin

    


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ రాజధాని అమరావతి పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి మోదీ ఈ నెల మూడో వారంలో రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 

వెలగపూడి సమీపంలోని సచివాలయం వెనుక ఉన్న 250 ఎకరాల్లో కార్యక్రమం నిర్వహించేందుకు పనులు ప్రారంభించారు. సామాన్య ప్రజలతోపాటు వీవీఐపీలు, వీఐపీల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సభాస్థలికి చేరుకునేందుకు మొత్తం 8 మార్గాలను గుర్తించారు.

Narendra Modi
Amaravati
Andhra Pradesh
Modi Amaravati Visit
AP Capital
India Politics
Government Event
Public Gathering
Construction Restart
  • Loading...

More Telugu News