KA Paul: నా పవర్స్ నాకున్నాయి... నేను శపిస్తే బూడిదే!: కేఏ పాల్

KA Paul Accuses Foul Play in Pastor Praveens Death

  • అనుమానాస్పద పరిస్థితుల్లో పాస్టర్ ప్రవీణ్ మృతి
  • మీడియాతో మాట్లాడిన కేఏ పాల్
  • ప్రవీణ్ వ్యవహారంలో తన సందేహాలే నిజమయ్యాయని వెల్లడి

ఇటీవల పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తెలిసిందే. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. 

మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రవీణ్ వ్యవహారంలో మొదటి నుంచి తాను లేవనెత్తుతున్న సందేహాలు నిజమయ్యాయని అన్నారు. మార్చి 24వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రవీణ్ తన ఫోన్ నుంచి భార్యతో కొన్ని సెకన్ల పాటు మాట్లాడాడని వెల్లడించారు. ఆ సమయంలో విజయవాడలో ఉన్న ప్రవీణ్, 11.30 గంటలకే రాజమండ్రి ఎలా చేరుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. సైరన్ ఉన్న తన వాహనమే రాజమండ్రి చేరుకోవడానికి మూడు గంటలు పడుతుందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. 

ప్రవీణ్ పగడాల తాగేశాడు, పడిపోయాడు, అతడు మందుబాబు అని దూషిస్తూ, అతడి పేరు ప్రతిష్ఠలను దెబ్బతీస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నా పవర్స్ నాకున్నాయి, నా ఫండమెంటల్ రైట్స్ నాకున్నాయి, నా దేవుడు నాకున్నాడు... నేను శపిస్తే బూడిదైపోయినవాళ్లు చాలా మంది ఉన్నారు.   ఏడుగురు బూడిదైపోయారు... రాజశేఖర్ రెడ్డితో సహా! ట్రంప్ కే దిక్కులేదు... ఇప్పుడు లైన్ లో పడ్డాడు... నాకు మద్దతు ఇస్తున్నాడు" అని కేఏ పాల్ పేర్కొన్నారు. 


KA Paul
Pastor Praveen Pagadala
Mysterious Death
Rajamahendravaram
Vijayawada
Controversial Statement
Praja Shanti Party
Political Figure
Death Investigation
Andhra Pradesh
  • Loading...

More Telugu News