Revanth Reddy: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రేవంత్ రెడ్డి సమీక్ష

Revanth Reddy Reviews Gachibowli Land Issue

  • ఏఐ వీడియోలు సృష్టించడాన్ని తీవ్రంగా పరిగణించిన రేవంత్ రెడ్డి
  • దీనిపై విచారణకు ఆదేశించేలా కోర్టును కోరాలని అధికారులకు దిశానిర్దేశనం
  • 25 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించినా పర్యావరణ వివాదం రాలేదన్న అధికారులు

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక్కడి 400 ఎకరాల భూముల్లో చెట్లను నరికివేయడంతో వన్యప్రాణులు చెల్లాచెదురయ్యాయంటూ కొందరు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియోలు సృష్టించడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణకు ఆదేశించేలా కోర్టును కోరాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కంచ గచ్చిబౌలి భూముల్లో 25 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, ఎన్నడూ వన్యప్రాణులు, పర్యావరణానికి సంబంధించిన వివాదాలు రాలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏఐ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని అధికారులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై అధికారులను ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని అన్నారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టే ఫోరెన్సిక్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టీజీఐఐసీ ఎండీ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Revanth Reddy
Gachibowli land issue
Telangana
AI fake videos
Cyber crime
Environmental concerns
Government review
Artificial Intelligence
Forest Department
Malli Bhatti Vikramarka
  • Loading...

More Telugu News