కేఎల్ రాహుల్ దూకుడుతో ఢిల్లీ భారీ స్కోరు... ఛేజింగ్ లో చెన్నైకి ఎదురుదెబ్బలు

  • ఐపీఎల్ లో నేడు ఢిల్లీ వర్సెస్ చెన్నై
  • టాస్ గెలిచి  బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు
  • ఛేదనలో 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సీఎస్కే
ఐపీఎల్ లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. 

డుప్లెసిస్ గైర్హాజరీలో ఓపెనర్ గా ప్రమోషన్ కొట్టేసిన కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 77 పరుగులు చేశాడు. మరో ఒపెనర్జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ (0) డకౌట్ అయినా... అభిషేక్ పోరెల్ (33), కెప్టెన్ అక్షర్ పటేల్ (21), సమీర్ రిజ్వి (24)అండతో రాహుల్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ట్రిస్టాన్ స్టబ్స్ 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

అనంతరం, 184 పరుగుల లక్ష్యంతో బరిలోదిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టు 41 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర 3, డెవాన్ కాన్వే 13, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. 

ప్రస్తుతం సీఎస్కే స్కోరు 9 ఓవర్లలో 3 వికెట్లకు 59 పరుగులు. విజయ్ శంకర్ 17, శివమ్ దూబే 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 1, ముఖేశ్ కుమార్ 1, విప్రాజ్ నిగమ్ 1 వికెట్ తీశారు.


More Telugu News