Chennai Super Kings: ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్... తొలి మ్యాచ్ లో సీఎస్కే, డీసీ అమీతుమీ

- ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
- చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
వీకెండ్ కావడంతో ఐపీఎల్ లో ఇవాళ డబుల్ హెడర్ (రెండు మ్యాచ్ లు) నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఒక మార్పు జరిగింది. ఫిట్ నెస్ తో లేకపోవడంతో ఫాఫ్ డుప్లెసిస్ ఈ మ్యాచ్ లో ఆడడం లేదు. అతడి స్థానంలో సమీర్ రిజ్వీ తుదిజట్టులోకి వచ్చాడు. అటు, చెన్నై జట్టులో రెండు మార్పులు చేశామని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు. ఓవెర్టన్ స్థానంలో డెవాన్ కాన్వే... రాహుల్ త్రిపాఠి స్థానంలో ముఖేశ్ చౌదరి ఆడుతున్నారని వివరించాడు.
ఐపీఎల్ తాజా సీజన్ లో ఇప్పటివరకు చెన్నై 3 మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ తర్వాత రెండో స్థానంలో ఉంది.