Pawan Kalyan: పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు

Pawan Kalyans Bhadrachalam Trip Cancelled

  • షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు భద్రాచలం చేరుకోవాల్సిన పవన్
  • సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలను సమర్పించాల్సిన డిప్యూటీ సీఎం
  • పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీకి సమాచారం

ఏపీ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది. రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణానికి పవన్ హాజరు కావాల్సి ఉంది. హైదరాబాద్ లోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకు ఆయన భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. రాత్రి భద్రాచలంలో బస చేసి, రేపు స్వామి వారి కళ్యాణానికి హాజరై ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సీతారాములకి సమర్పించాల్సి ఉంది. 

అయితే పవన్ పర్యటన రద్దు అయినట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీకి సమాచారం అందింది. తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ నెల 11న ఒంటిమిట్టలో కోదండరాములవారి కళ్యాణోత్సవం జరగనుంది. ఏపీ ప్రభుత్వం తరపున స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

Pawan Kalyan
Bhadrachalam Trip Cancelled
Andhra Pradesh Government
Sriramanavami
Telangana Intelligence DG
Religious Visit
Political News
Pawan Kalyan Bhadrachalam
AP Deputy CM
  • Loading...

More Telugu News