'నోట్‌బుక్‌' సెల‌బ్రేష‌న్స్‌.. దిగ్వేశ్‌కు మ‌ళ్లీ ఫైన్‌.. పంత్‌కు కూడా!

  • నిన్న‌ ల‌క్నో వేదిక‌గా ఎంఐ, ఎల్ఎస్‌జీ మ్యాచ్  
  • ముంబ‌యి బ్యాట‌ర్ న‌మ‌న్ ధీర్‌ను ఔట్ చేసిన దిగ్వేశ్‌
  • మ‌రోసారి త‌న‌దైన స్టైల్‌లో సెల‌బ్రేష‌న్స్
  • దాంతో అత‌ని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత‌, 2 డీమెరిట్ పాయింట్లు
  • స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా పంత్‌కు రూ. 12ల‌క్ష‌ల జ‌రిమానా
శుక్రవారం రాత్రి ల‌క్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజ‌యం సాధించింది. 12 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, ఈ మ్యాచ్‌లో మ‌రోసారి యువ స్పిన్నర్ దిగ్వేశ్‌ సింగ్ రాఠీకి జ‌రిమానా ప‌డింది. 

ఇంత‌కుముందు మ్యాచ్‌లో అత‌ని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించిన బీసీసీఐ... ఈసారి ఏకంగా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. అలాగే అత‌ని ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్‌ను కూడా జోడించింది. దీనికి కార‌ణం అత‌ని నోట్‌బుక్ సెల‌బ్రేష‌న్స్‌. 

ముంబ‌యి బ్యాట‌ర్ న‌మ‌న్ ధీర్‌ను ఔట్ చేసిన త‌ర్వాత మ‌రోసారి దిగ్వేశ్ త‌న‌దైన స్టైల్‌లో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. అలాగే అనుచిత భాషను కూడా ఉపయోగించాడు. దాంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ‌రోసారి ఫైన్ ప‌డింది. అటు ల‌క్నో కెప్టెన్ రిషభ్‌ పంత్ కూడా రూ.12 లక్షల జరిమానా విధించబడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్‌కు ఈ ఫైన్ ప‌డింది. 

"శుక్రవారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 16వ మ్యాచ్‌లో తన జట్టు స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందున లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్‌ పంత్‌కు రూ. 12ల‌క్ష‌ల జరిమానా విధించబడింది" అని ఐపీఎల్ త‌న ప్రకటనలో పేర్కొంది.  


More Telugu News