Jr NTR: 'అదుర్స్-2' సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Jr NTRs Interesting Comments on Aadurs 2

  • తారక్ బిగ్గెస్ట్ హిట్స్ లో 'అదుర్స్' సినిమా ఒకటి
  • ఈ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి కామెడీ పండించిన తారక్
  • 'అదుర్స్-2' చేయడానికి భయపడుతున్నానన్న ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో 'అదుర్స్' సినిమా ఒకటి. ఈ సినిమాలో తారక్ కామెడీని కూడా పండించారు. బ్రహ్మానందంతో కలిసి తారక్ చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా సీక్వెల్ 'అదుర్స్-2' సినిమా కోసం వస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలెబ్రేషన్స్ కు ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ వేడుకలో తారక్ మాట్లాడుతూ... ఏ ఆర్టిస్టుకైనా కామెడీ పండించడం చాలా కష్టమని చెప్పారు. అందుకే 'అదుర్స్-2' చేయడానికి భయపడుతున్నానని తెలిపారు. నవ్వించడం గొప్ప వరమని చెప్పారు. 'దేవర-2' సినిమా గురించి మాట్లాడుతూ... ఈ సినిమా ఉండదని చాలా మంది అనుకుంటున్నారని... కానీ 'దేవర-2' కచ్చితంగా ఉంటుందని చెప్పారు. 'దేవర' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆదరించారని అన్నారు. ఇది అభిమానులు భుజం మీద మోసిన సినిమా అని చెప్పారు. 

Jr NTR
Aadurs2
Jr NTR Comedy
Brahmanandam
Tollywood
Telugu Cinema
Trivikram Srinivas
Mad Square Success
  • Loading...

More Telugu News