R Gangadhara Rao: ఏపీలో రూ. 28.97 లక్షల మద్యం ధ్వంసం

- మచిలీపట్నంలో మద్యం బాటిళ్లు ధ్వంసం
- 2013 నుంచి 2025 ఫిబ్రవరి మధ్య నిర్వహించిన తనిఖీల్లో 15,280 మద్యం సీసాలు స్వాధీనం
- 684 లీటర్ల నాటుసారా కూడా ధ్వంసం
కృష్ణా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న రూ. 28.97 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు సమక్షంలో శుక్రవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
2013 నుంచి 2024 ఫిబ్రవరి మధ్య కాలంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో వివిధ కేసుల్లో 15,280 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని శుక్రవారం రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. 684 లీటర్ల నాటుసారాను పారబోశారు.