Darshan: హైకోర్టు న్యాయమూర్తి కుమారుడిపై దాడి.. నటుడు దర్శన్ అరెస్ట్

Tamil Actor Darshan Arrested for Assaulting High Court Judges Son

  • చెన్నైలోని ముగప్పేర్‌లో ఘటన
  • కారు పార్కింగ్ విషయంలో న్యాయమూర్తి కుమారుడు ఆత్తిచుడి, దర్శన్‌కు మధ్య గొడవ
  • ఆపై పరస్పరం దాడి చేసుకున్న వైనం
  • గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆత్తిచుడి, ఆయన అత్త మహేశ్వరి

తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు ఆత్తిచుడి, ఆయన అత్త మహేశ్వరిపై దాడి చేసిన ఘటనలో తమిళ నటుడు దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  విజయ్ టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్ -3 ద్వారా నటుడు దర్శన్ పేరు తెచ్చుకున్నాడు. శ్రీలంకు చెందిన దర్శన్ ‘గూగుల్ కట్టప్ప’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. చెన్నైలోని ముగప్పేర్‌లో ఉంటున్న దర్శన్ ఇంటి ముందు టీ దుకాణం ఉంది.

అక్కడ టీ తాగేందుకు వచ్చిన కొందరు వ్యక్తులు దర్శన్ ఇంటి ముందు కారు పార్క్ చేశారు. దీంతో అక్కడి నుంచి కారును తీయాలని దర్శన్ కోరాడు. ఈ క్రమంలో కారు పార్క్ చేసిన ఆత్తిచుడి, దర్శన్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. అది మరింత ముదిరి పరస్పరం దాడి చేసుకున్నారు. గాయపడిన ఆత్తిచుడి, మహేశ్వరి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శన్, ఆయన సోదరుడు లోకేశ్‌లను అరెస్ట్ చేశారు. అలాగే, దర్శన్ ఫిర్యాదుతో ఆత్తిచుడి, ఆయన భార్య, అత్త పైనా కేసు నమోదైంది.

Darshan
Tamil Actor Darshan Arrest
High Court Judge's Son Attacked
Attchudi
Maheshwari
Chennai Assault Case
Big Boss Tamil 3
Google Kattappa
Lokesh
Fight over Car Parking
  • Loading...

More Telugu News