Rajinikanth: రజినీకాంత్ ‘కూలీ’ విడుదల తేదీ ఖరారు

- రజినీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబోలో ‘కూలీ’
- ఆగస్టు 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటన
- ఈ మేరకు సన్ పిక్చర్స్ సోషల్ మీడియా పోస్ట్
సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కూలీ. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ విడుదల తేదీని తాజాగా మేకర్స్ ఖరారు చేశారు. ఆగస్టు 14న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేసింది.
ఇక లోకేశ్ కనకరాజ్ సినిమాలకు యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈయన రేంజ్ వేరే. అలాంటి దర్శకుడితో సూపర్ స్టార్ జతకడుతుండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.