Anita: ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పని చేయలేదో దర్యాప్తు చేస్తున్నాం: అనిత

AP Secretariat Fire Minister Anitas Statement on Investigation

  • ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం
  • అగ్నిప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందన్న అనిత
  • అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందన్న హోం మంత్రి

ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్ లో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, హోం మంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా ఉన్నారు. 

ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ... అగ్నిప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని చెప్పారు. బ్యాటరీ రూమ్ పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పని చేయలేదో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని తెలిపారు. సచివాలయంలోని అన్ని బ్లాక్స్ ను పూర్తిగా తనిఖీ చేసి అగ్నిప్రమాదాల విషయంలో ఏమేరకు సురక్షితంగా ఉన్నాయో రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం, హోం మంత్రి, ఆర్థిక మంత్రి ఉండే కీలక బ్లాకులో ప్రమాదం జరగడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

Anita
Andhra Pradesh Secretariat Fire
Fire Safety Alarm Failure
Vijayawada Fire Incident
AP Secretariat Fire Investigation
Chief Minister Chandrababu Naidu
Home Minister Anita
AP Government Officials
Battery Room Fire
  • Loading...

More Telugu News