ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు చుక్కలను అంటనున్న ఐఫోన్ ధరలు
- ఫోన్ ధరలు 30 నుంచి 40 శాతం పెరుగుతాయంటున్న నిపుణులు
- ఐఫోన్ల తయారీ మొత్తం చైనాలోనే చేస్తున్న యాపిల్ కంపెనీ
- చైనాపై ట్రంప్ టారిఫ్ లు విధించడంతో సంస్థపై ప్రభావం
దీంతో ఐఫోన్ల ధరలకు రెక్కలు వస్తాయని, సగటున ఐఫోన్ ధరలు 30 నుంచి 40 శాతం పెరుగుతాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెరిగిన పన్నుల భారాన్ని తానే భరించాలా లేక వినియోగదారుడిపై మోపాలా అనేది యాపిల్ సంస్థ ఇంకా నిర్ణయించలేదు. అయితే, అంతిమంగా వినియోగదారుడిపైనే ఆ భారం మోపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 మోడల్ ధర 799 డాలర్లు (సుమారు రూ.68 వేలు). ట్రంప్ టారిఫ్ ల భారం వినియోగదారుడిపై మోపాలని యాపిల్ నిర్ణయిస్తే.. ఈ మోడల్ ధర 1,142 డాలర్ల (సుమారు రూ.97 వేలు)కు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్ (1 టెరాబైట్) 2,300 డాలర్లకు (సుమారు రూ.2 లక్షలకు) చేరవచ్చని నిపుణుల అంచనా.