Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊరట

Ram Gopal Varma Gets Relief from AP High Court

  • చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసు
  • విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసులు
  • వర్మపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశాలు

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ వర్మకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, సీఐడీ ఇచ్చిన నోటీసులను హైకోర్టులో వర్మ సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వర్మకు ఊరటనిచ్చింది. వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Ram Gopal Varma
Andhra Pradesh High Court
AP CID
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
Social Media Comments
Morphed Photos
Legal Case
Interim Relief
  • Loading...

More Telugu News