Eedamma: తెలంగాణలో విషాదం... పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

- తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
- నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు మహిళా కూలీలు మృతి
తెలంగాణలో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదర మండలంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో పిడుగుపాటుకు గురై ఈదమ్మ (55), సైదమ్మ (35) ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది.