Aishwarya Rai Bachchan: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ శివరాజ్ కు కళ్లు చెదిరే జీతం!

Aishwarya Rai Bachchans Bodyguard Earns a Staggering Salary
  • ఐశ్వర్యరాయ్ బచ్చన్ బాడీగార్డుగా పని చేస్తున్న శివరాజ్
  • శివరాజ్ వార్షిక వేతనంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ
  • శివరాజ్ వేతనం ఏడాదికి రూ.84 లక్షలు అంటూ ప్రచారం
సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు తమ భద్రత దృష్ట్యా వ్యక్తిగత అంగరక్షకులను నియమించుకుని వారికి భారీ వేతనాలు చెల్లిస్తుంటారు. ఈ క్రమంలోనే మాజీ ప్రపంచ సుందరి, నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ బాడీగార్డు శివరాజ్ వేతనానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శివరాజ్ అందుకుంటున్న జీతం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతనికి ఇంత వేతనమా అని నోరెళ్లబెడుతున్నారు. అతని వేతనం బహుళజాతి కంపెనీల సీఈఓల కంటే అధికంగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇంతకీ ఐశ్వర్యరాయ్ బాడీగార్డు శివరాజ్ నెల జీతం ఎంతంటే.. అక్షరాలా రూ.7 లక్షలు. అంటే ఏడాదికి రూ.84 లక్షలను అతను వేతనంగా ఐశ్వర్య రాయ్ నుండి అందుకుంటున్నాడని సమాచారం.

దేశ విదేశాల్లో ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా శివరాజ్ ఆమె వెన్నంటే ఉంటాడు. బాడీగార్డుగా విధులు నిర్వహిస్తున్న శివరాజ్ .. బచ్చన్ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. 2015లో శివరాజ్ వివాహానికి సైతం ఐశ్వర్య హాజరై నూతన దంపతులను అభినందించారు. దీనిని బట్టి బాడీగార్డు శివరాజ్‌కు బచ్చన్ కుటుంబం ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 
Aishwarya Rai Bachchan
Bodyguard Shivraaj
Salary
Bollywood Celebrity
High Salary
Security Personnel
Viral News
Aishwarya Rai's Bodyguard
Celebrity Bodyguard Salary
Indian Celebrity Security

More Telugu News